అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూ మెక్సికోలో జరిగిన కారు ప్రదర్శనలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పరస్పరం కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు.. 15 మందికి తీవ్ర గాయాలవడంతొ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై లాస్ క్రూసెస్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. అనుమతి లేని కారు ప్రదర్శన సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. మృతుల్లో ఇద్దరు టీనేజర్లు ఉన్నారని.. గాయపడిన వారంతా 16 నుంచి 36 సంవత్సరాల వయస్సు మధ్యవారేనని అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

