Andhra PradeshHome Page Slider

ఈ నెల 5న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

రానున్న 12 గంటల్లో వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశముందని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో కోస్తాలో మోస్తరు వర్షాలు పడుతాయని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడలో తీవ్ర పాల కొరత ఏర్పడింది. పాల ప్యాకెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. విజయ డెయిరీ యూనిట్‌ను వరద ముంచెత్తింది. బుడమేరు ఉధృతితో డెయిరీలోకి వర్షపునీరు చేరింది. డెయిరీ యూనిట్‌ లోపల నడుంలోతుకు వరకు నీరు చేరింది. దాదాపు 1.50 లక్షల లీటర్ల పాల ప్యాకెట్లు,పెరుగు నీట మునిగింది. పాల ప్యాకెట్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 5న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది.