మహారాష్ట్రలో మరోదారుణం..రోడ్లపై వేలమంది నిరసన
కోల్‌కతా ఘటన ఇంకా మరువక ముందే మరో దారుణం మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో జరిగింది. ఒక పాఠశాలలో పనిచేసే స్వీపర్ అక్కడ చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. తాత్సారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేల మంది రోడ్లపైకి వచ్చారు. స్కూల్ ఎదుట, సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల కారణంగా ఆప్రాంతంలోని లోకల్ రైళ్లను అధికారులు నిలిపివేశారు.


 
							 
							