NationalNews Alert

ఏపీలో పేదలకు అన్న యోజన షురూ…

Share with

కరోనా కారణంగా ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏపీలో గత నాలుగు నెలలుగా ఆపిన విషయం అందరికి తెలిసిందే. దీని పై బీజేపీ నేతలు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. అయితే  ఇటీవల కేంద్ర మంత్రి హెచ్చరించడం , హైకోర్టులోని తీర్పుతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉచిత బియ్యాన్ని సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. చిత్తురు కరువు జిల్లా జాబితాలో ఉన్నందున 4.99 లక్షల కార్డులకు… కార్డులోని ప్రతి కుటుంబ సభ్యునికీ 5 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. 4.99 లక్షల కార్డులకు 8వేల టన్నుల బియ్యం విడుదల చేసినట్టు తెలిపింది.

జిల్లాలో మెత్తం 5,31,264 తెల్లకార్డులుండగా , వాటిలో ఆహార భద్రతా చట్టం కింద జూలై నాటికి 4,99,730 ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారమిచ్చారు. వారంలో  1 నుంచి 15 వ తేదీ వరకు ఇచ్చే బియ్యం , కందిపప్పు , చక్కెరను ఎండీయూ వాహనాల ద్వారా , 16 నుంచి 30 వరకు డీలర్ల ద్వారా పంపిణీ జరిగేవి. కానీ ఆగష్టు , సెప్టెంబరు నెలల్లో  పంపిణీ చేసే ఈ బియ్యం మాత్రం డీలర్లే పంపిణీ చేయాలని నిర్ణయించింది.