NationalNewsNews Alert

మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం

Share with

మంకీపాక్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశంలో మంకీపాక్స్ ఆందోళనలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ అన్ని దేశాలను హెచ్చరిస్తోంది. ఇటీవల కాలంలో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే స్పెయిన్ లో మంకీపాక్స్ వల్ల ఇద్దరు చనిపోయారు. ఇదిలా ఉంటే ఇండియాలో ఇప్పటికే నలుగురికి మంకీపాక్స్ వ్యాధి సోకింది. కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత మంకీపాక్స్ వ్యాధికి గురయ్యారు. ఇందులో 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ తో మరణించడం అందరిలోనూ కలవరానికి గురిచేస్తోంది. కేరళకు ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ గుర్తించారు. అయితే చికిత్స తీసుకుంటున్న క్రమంలో త్రిసూర్ లో అతడు మరణించాడు. త్రిస్సూర్ జిల్లాలోని చావక్కల్ కురంజియూర్ కు చెందిన యువకుడికి ఇటీవల మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. అతడి శాంపీళ్లను పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఈ మృతితో దేశంలో మెదటి మంకీపాక్స్ మరణం నమోదైంది. యూఏఈలో ఉన్నప్పుడు జూలై 19న చేయించుకున్న పరీక్షల్లో అతడికి మంకీపాక్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ తరువాత అతడు కేరళ చేరుకున్నాడు. అతడి ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు జూలై 30 వరకూ ఆరోగ్యశాఖ అధికారులకు తెలపలేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విమర్శించారు. తగిన వైద్యం చేసి ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదన్నారు.

తాజాగా మరణించిన వ్యక్తితో సంబంధం ఉన్న 20 మందిని క్వారంటైన్ చేశారు అధికారులు. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు అతని 10 మంది స్నేహితులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 20 మందిని క్వారంటైన్ చేశారు. అధికారులు. త్రిస్సూర్ జిల్లాలోని పున్నయూర్ గ్రామంలోని పంచాయతీ సభ్యులు కూడా ఓ సమావేశాన్ని నిర్వహించి బాధిత వ్యక్తి మరణించిన తర్వాత చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ప్రస్తుతం మరణించిన వ్యక్తి కాంటాక్ట్స్ వెతికే పనిలో పడ్డారు అధికారులు. ఇదిలా ఉంటే ఇండియాలో మంకీపాక్స్ తొలి మరణం సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు భయాందోళనకు గురికావొద్దన్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా లక్షణం కనిపిస్తే సకాలంలో తెలియజేయాలని వీకే పాల్ అన్నారు.