మరోసారి నిరాహార దీక్షకు అన్నా హజారే నిర్ణయం
మహారాష్ట్రలో లోకాయుక్త చట్టం అమలులో జరుగుతున్న ఆలస్యంపై నిరసనగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 30 నుంచి తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు.
2022లో జరిగిన తన నిరాహార దీక్ష అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లును ఆమోదించినప్పటికీ, చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని హజారే ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మళ్లీ ఉద్యమ దారిని ఎంచుకున్నట్లు తెలిపారు. హజారే నిర్ణయంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. చట్ట అమలు వేగవంతం చేస్తారా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు నెలకొన్నాయి.

