కేరళలో అదుపు తప్పిన ఏనుగు..
కేరళలోని పాలక్కాడ్ జిల్లా పట్టాంబిలో ప్రతి సంవత్సరం పట్టాంబి నేర్చ జరుగుతుంది. ఇది ఆలూర్ వలియ పూకుంజికోయ తంగల్ జ్ఞాపకార్థం జరుపుకుంటారు. దాదాపు వంద ఏనుగులు ఈ ఉత్సవంలో పాల్గొంటాయి. పేరూర్ శివన్ అనే ఏనుగు అదుపుతప్పి జనాన్ని పరుగులు పెట్టించింది. అతి కష్టంతో ఆ ఏనుగును యజమాని పట్టుకున్నాడు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

