Home Page SliderNationalNews Alert

అమితాబ్‌ బచ్చన్‌కు భారతరత్న ఇవ్వాలి..

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమితాబ్‌ బచ్చన్‌ దంపతులతో పాటు షారుఖ్‌ ఖాన్‌, మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమితాబ్‌ ఒక లెజెండ్‌ అని, ఇండియాకే ఒక ఐకాన్‌ అని ఆమె కొనియాడారు. భారత సినీ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారన్నారు. భారత రత్నకు అమితాబ్‌ అన్ని విధాలా అర్హుడని చెప్పారు.