ఉక్రెయిన్‌కు మరో షాక్ ఇచ్చిన అమెరికా..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన అమెరికా, ఇటీవల ఉక్రెయిన్ పైనే రివర్స్‌లో ఆరోపణలు చేస్తోంది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికయ్యాక, ఈ రెండు దేశాల మధ్యా సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మీడియా ఎదురుగానే వాగ్వాదానికి దిగడం, జెలెన్‌స్కీని స్టుపిడ్ ప్రెసిడెంట్ అనడం, అవమాన పరచడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఉక్రెయిన్‌కు మరో షాక్ ఇచ్చింది అమెరికా. ఉక్రెయిన్‌కు పూర్తిగా మిలటరీ సహాయాన్ని నిలిపివేసింది. వైట్‌హౌస్ అధికారి ఒకరు ఈ విషయాన్ని దృవీకరించారు. అధ్యక్షుడు ట్రంప్ శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నారని, భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికా సహాయాన్ని నిలిపివేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.


 
							 
							