Andhra PradeshHome Page Slider

జగన్‌కు అంబటి రాయుడు ఝలక్

క్రికెటర్ అంబటి రాయుడికి రాజకీయాలు బాగా వంట బట్టినట్లుగా కనిపిస్తోంది. వారం రోజుల క్రితమే అంబటి రాయుడు వైసీపీలో చేరగా.. ఇప్పుడు పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు. గత కొద్దికాలంగా అంబటి రాయుడు వైసీపీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగున్నాయని, పేద ప్రజలు ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారని.. స్కూళ్లు, వైద్యం అందించడమే నిజమైన అభివృద్ధి అంటూ ఆయన జగన్ సర్కారుపై ప్రశంశల జల్లు కురిపించారు. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నిక్లలో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని పార్టీ భావించింది. అయితే ఆయన తాజాగా రాజకీయాలకు దూరంగా ఉంటాయంటూ ప్రకటించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు.

వాస్తవానికి గత కొద్ది రోజులుగా అంబటి రాయుడు పై వైసీపీ హై కమాండ్ చాలా ఆశలు పెట్టుకుంది. రెండోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం, పార్టీ బలహీనంగా ఉన్న గుంటూరు జిల్లాలో ఊపు తీసుకొచ్చేందుకు… అంబటి రాయుడిని అస్త్రంగా వాడాలని వైసీపీ యత్నించింది. ఇందులో భాగంగా ఆయనకు ప్రాధాన్యత కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆయన తాజాగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టుగా ప్రకటించారు. దీంతో గుంటూరు జిల్లాలో వైసీపీకి వచ్చే రోజుల్లో గడ్డుకాలం తప్పదన్న భావన ఉంది. అంబటి రాయుడు రాజీనామా చేయడం పార్టీకి గట్టి దెబ్బగా విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తర్వాత ఏదైనా ఉంటే వివరిస్తానంటూ కూడా తేల్చి చెప్పారు. గత కొద్ది రోజులుగా వైసీపీలో తిరుగుబాట్లు ఎక్కువవుతున్న తరుణంలో ఇటీవల పార్టీలో చేరిన అంబటి రాయుడు పార్టీకి గుడ్ బాయ్ చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చిన అంశమవుతోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి, సిట్టింగ్ అభ్యర్థులను మార్చుకుంటూ ముందుకు వెళ్తుంటే మరోవైపు సీట్లు రాని అభ్యర్థులంతా సొంతంగానూ, లేదంటే కాంగ్రెస్ నుంచి లేదంటే, సీటు దొరికితే జనసేన- టిడిపి కూటమి నుంచైనా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరికొందరు వైసీపీలోకి వెళ్తే లాభమా నష్టమా అని బేరీజు వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెటర్‌గా… మంచి బ్రేక్ రాకుండానే రిటైరైన అంబటి రాయుడు, రాజకీయాల్లోనూ సరైన అడుగులు వేయలేదన్న భావన ఉంది. క్రికెట్ శకం ముగిసిపోకా.. రాజకీయ శకం.. ఆరంభం కాకముందు ఒడిదిడుకులు ఎదుర్కొంటోంది. వైసీపీలో చేరిన వారం రోజులకే ఆయన పార్టీకి గుడ్ బాయ్ చెప్పడం ఒక విషాదమని చెప్పాల్సి ఉంటుంది. ఆయన మరో పార్టీలో చేరతారా, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటారా చూడాలి. వాస్తవానికి అంబటి రాయుడు జనసేనలో చేరితే తాము ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ వర్గీయులు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. ఇందులో భాగంగానే అంబటి రాజీనామా చేశారా లేదంటే ఇంకేమైనా ఉందా త్వరలోనే తేలనుంది.