Andhra PradeshHome Page Slider

కాపులకు పట్టిన శని… పవన్ కల్యాణ్‌పై అంబటి ఫైర్

కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావ్
చంద్రబాబు దగ్గర గాడిద చాకిరి చేయిస్తావా?
కాపులకు ఎవరేం చేశారో తేల్చుకుందమా?
కాపులను బలివ్వొద్దు.. పవన్ కు అంబటి వార్నింగ్

 కాపుల గుండెల్లో కుంపటి పెడుతోంది ఎవరని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. ఆ పని ఎప్పుడు చేశానో చెప్పాలని పవన్‌ను అంబటి ప్రశ్నించారు.  గతంలో మద్రగడ పద్మనాభాన్ని, ఆయన భార్య , కుమారుడ్ని నీ పార్టనర్‌ చంద్రబాబు దౌర్జన్యంగా కొట్టి వేధించినప్పుడు, వారికి అండగా నిలబడింది నేనన్నారు అంబటి. మీ అన్నయ్య చిరంజీవి, దాసరి నారాయణరావుతో మాట్లాడి నాడు పార్క్ హయత్‌లో సమావేశం ఏర్పాటు చేసి తానే ఖండించానన్నారు అంబటి. కానీ నేడు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని, కాపులను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నావని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పాతికో, పరకో ప్యాకేజీ తీసుకుని, చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తావో, లేక బీజేపీతో వస్తావో, లేక ఒంటరిగా వస్తావో తేల్చుకో. నీ ఇష్టం. నీవు గాడిద మాదిరిగా చంద్రబాబును ఎత్తుకుని ఊరేగుతావో నీ ఇష్టం. అంతే తప్ప, కాపులను అవమానించొద్దన్నారు పవన్. నీ స్వార్థం కోసం వారిని బలి చేయొద్దన్నారు. కాపులందరినీ చంద్రబాబును మోయమనడం తప్పు. ఆయన ఒక దుర్మార్గుడు, ముద్రగడ పద్మనాభాన్ని సైతం వేధించాడన్నారు. ఇవన్నీ వదిలేసి అమాయకమైన కాపు ప్రజలను చంద్రబాబు దగ్గర గాడిద చాకిరి చేయించడానికి చుస్తున్నావని రాంబాబు విమర్శించారు.