చీరాల నుంచే పోటీ చేస్తా-ఆమంచి కృష్ణమోహన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను చీరాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు పర్చూరు వైసీపీ ఇన్ చార్జి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులతో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయడం ఖాయమని… అది ఏదైనా పార్టీ తరపునా లేదంటే స్వతంత్రంగా అన్నది త్వరలో తేలుతుందన్నారు. ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎంతో భేటీ తర్వాత ఆమంచి ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్‌చార్జిగా కరణం వెంకటేష్ ఉన్నారు. చీరాలలో ఆమంచి పోటీ చేస్తున్నాడన్న సంకేతాలను పంపించాలని ఆయన అనుచరులను కోరినట్టు తెలుస్తోంది.


