Home Page Slidermoviestelangana,

దిల్ రాజుతో పాటు సుకుమార్ ఇంట్లో కూడా షురూ

పుష్ప2 నిర్మాతలు మైత్రీమూవీస్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులపై ఐటీ అధికారులు కన్నేశారు. వీరిలో డైరక్టర్ సుకుమార్ కూడా చేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఆయనను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప2 మూవీ సంచలన విజయం సాధించింది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రానికి తగినంత పన్ను కట్టలేదని ఐటీ శాఖ ఆరోపిస్తున్నట్లు సమాచారం.