Home Page SliderNational

అల్లు అయాన్ లెటర్ వైరల్..

పుష్ప2 విడుదల నేపథ్యంలో తన తండ్రి అల్లు అర్జున్ కు అల్లు అయాన్ లెటర్ రాశాడు. `నాన్నా.. నిన్ను, నీ విజయాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. నిన్ను నంబర్1గా చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ రోజు చాలా ప్రత్యేకం. ప్రపంచంలోనే గొప్ప నటుడి సినిమా రిలీజ్ అవుతోంది. నువ్వెప్పుడూ నా హీరోవే. నీకు ఉన్న ఎంతోమంది అభిమానుల్లో నేను మొదటివాడిని’ అని రాసుకొచ్చాడు. దీన్ని షేర్ చేసిన అల్లు అర్జున్ ఇలాంటి ప్రేమను పొందడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాల్లో ఇది అతి పెద్దదని బన్నీ పేర్కొన్నారు.