Home Page SliderNational

‘హాయ్ నాన్న’ చిత్రంపై అల్లు అర్జున్ కామెంట్

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రంపై స్టార్ అల్లుఅర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంపై తన రివ్యూ ఇచ్చారు. ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా ఉందన్నారు. సోదరుడు నాని తన నటనతో ఎంతో ఆశ్చర్యపరిచారని, ఇంతమంచి స్క్రిప్ట్‌ను అందించిన చిత్రబృందానికి శుభాకాంక్షలని పేర్కొన్నారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన ఎంతో ఆకట్టుకుందని, బేబీ కియారా నటన చాలా క్యూట్‌గా ఉందని అభినందించారు. దర్శకుడు శౌర్యువ్ తొలిచిత్రంలోనే అందరినీ ఆకట్టుకున్నారు. కెమెరా మ్యాన్ అద్భుతంగా చిత్రాన్ని తీశారని, ఈ చిత్రం తండ్రులనే కాక, కుటుంబంలో అందరి మనసులనూ హత్తుకుంటుందన్నారు. ఈ పోస్టుకు హీరో నాని రిప్లై ఇస్తూ, ధన్యవాదాలు బన్నీ, మంచి సినిమాలను మీరు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారంటూ పేర్కొన్నారు.