Home Page SliderTelangana

అల్లు అర్జున్ జైలుకెళ్లాడం ఖాయం

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సినీ హీరో అల్లు అర్జున్ వెనుక ఓ మహా శక్తి ఉందన్నారు. రెండు, మూడ్రోజుల్లో ఆయన బెయిల్ రద్దు అవుతుందని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ పక్షాన నిలబడిన వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొంటానని ప్రకటించారు.