Home Page SliderTelangana

తెలుగులో ‘సలార్‌’ కోసం అల్లు అరవింద్ ప్లాన్

భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సలార్‌ను తెలుగులో విడుదల చేసేందుకు రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్న ఈ యాక్షన్ చిత్రం టీజర్ కూడా ఈరోజే రిలీజ్ అయ్యింది. కేజీఎఫ్‌తో భారీ సక్సెస్ కొట్టిన డైరక్టర్ ప్రశాంతి నీల్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. దీనితో ఈ చిత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. గీతా ఆర్ట్స్ 50 వ వార్షికోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అరవింద్. ఇప్పటికే కాంతార మూవీని కూడా గీతా ఆర్ట్సే తెలుగులో రిలీజ్ చేయడంతో, హోంబలే ఫిల్మ్స్ వారితో అరవింద్‌కు బాగానే రిలేషన్స్ ఉన్నాయంటున్నారు. కానీ హోంబలే నుండి ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం అంత ఈజీ కానట్లే ఉంది. సలార్‌ చిత్రానికి ఉన్న డిమాండ్‌ను బట్టి భారీగానే వసూలు చేస్తారని సినీ ప్రముఖులు అంటున్నారు.