ఏపీలో యువ మంత్రులకు కీలక శాఖలు
ఎట్టకేలకు ఏపీ కొత్తప్రభుత్వంలో మంత్రి వర్గానికి శాఖలు ఖరారయ్యాయి. అందరూ ఊహించినట్లే ఈ శాఖలు నిర్ణయించబడ్డాయి. ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్‌తో పాటు ఇతరులకు కేటాయించని శాఖలను చంద్రబాబు నాయుడు తనవద్దే ఉంచుకున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేష్‌కు మానవ వనరులు, ఐటీ శాఖలు కేటాయించారు. అచ్చెనాయుడికి వ్యవసాయశాఖ,మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖలు కేటాయించారు. కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలు, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కి ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, కస్టమర్ అఫైర్స్ కేటాయించగా వంగలపూడి అనితకు హోంశాఖ కేటాయించి మంత్రి వర్గంలో మహిళలకు పెద్దపీట వేశారు.
గొట్టిపాటి రవికుమార్-విద్యుత్ శాఖ
టీజీ భరత్-పరిశ్రమలు
జనార్థన్ రెడ్డి-రోడ్లు,భవనాలు
గుమ్మడి సంధ్యారాణి-మహిళా, శిశుసంక్షేమం,గిరిజన సంక్షేమం
కందుల దుర్గేష్-పర్యాటకం, సినిమాటోగ్రఫీ
రాంప్రసాద్ రెడ్డి-ట్రాన్స్‌పోర్ట్, యువజన, క్రీడలు
కొండపల్లి శ్రీనివాస్-ఎంఎస్‌ఎంఈ,సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్
ఎస్.సవిత-బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్
ఆనం రామనారాయణ రెడ్డి-దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ -ఆర్థిక, ప్రణాళిక,వాణిజ్యపన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్-రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
కొలుసు పార్థసారథి-హౌసింగ్,
డీబీ స్వామి- సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామీణ వాలంటీర్
వాసంసెట్టి సుభాష్-లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
సత్యకుమార్ యాదవ్-(బీజేపీ)-ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,వైద్యవిద్య
ఫరూక్-న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
నిమ్మల రామానాయుడు-జలవనరులు
పొంగూరు నారాయణ-మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి


 
							 
							