Andhra PradeshNews

బీజేపీతో సంసారం… చంద్రబాబుతో శృంగారం…

పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పరిస్థితి బీజేపీతో సంసారం, చంద్రబాబుతో శృంగారం తీరుగా మారిందని వైసీపీ నాయకులు దాడిశెట్టి రాజా, ఎం. శంకర్‌ నారాయణ, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ కు బీజేపీ, టీడీపీలతో డీల్‌ కుదిరిందని, ప్యాకేజీ కూడా సెట్‌ అయిందని విమర్శించారు. అది జన సేన కాదని “నారా – నాదెండ్ల’’ సేన పార్టీ అని వర్ణించారు. రాజకీయం అంటే సొంత కళ్యాణం లోక కళ్యాణమని పవన్‌ తెలుసుకోవాలన్నారు. పవన్‌కు చంద్రబాబు ఉన్నారని, ప్యాకేజీ కావాల్సి ఉందని ధ్వజమెత్తారు. రాజకీయ కరువులో ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు స్పెషల్‌ స్టేటస్‌, స్పెషల్‌ ప్యాకేజీలు అందాయని, అందుకే వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కావాలంటూ పిచ్చివాగుడు వాగుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో దుష్టచతుష్టయం – పవన్‌ లా కడుపు నిండిందని, జనం కడుపు ఎండిందని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరికి మంచి చేసే సంస్కారం వైఎస్‌ జగన్‌ గారికే సొంతమని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు 2019లోనే టీడీపీ విముక్త, జనసేన విముక్త ఆంధ్రప్రదేశ్‌ను చూపించడంతో పవన్‌ కళ్యాణ్‌కు మెంటల్‌ ఎక్కిందని వ్యాఖ్యానించారు. అమిత్‌ షా… పవన్‌ కళ్యాణ్‌ను పట్టించకోకుండా మరో సినీ నటుడిని కలవడం వల్లే ఆయనకు టీడీపీ వైపు వెళ్లాలన్న ఆత్రం పెరిగిందన్నారు.