అమెరికాలో ఆకస్శికంగా నిలిచిపోయిన విమానప్రయాణాలు
అంతుపట్టని సాంకేతిక లోపంతో అమెరికాలోని విమానాలు అన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ రోజు విమానాలు ఎయిర్‌పోర్ట్‌లకే పరిమితమయ్యాయి. దీంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న విమానాలు కూడా నేషనల్ ఎయిర్ స్పేస్ సిస్టంలోని ఇబ్బందుల కారణంగా రద్దు చేయబడ్డాయి. ఈ విషయాన్ని (FAA)యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా నిర్ధారించింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికాలో విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. ఈ విషయాన్ని యూఎస్ ఫెడరల్ ఏవీయేషన్ నోటామ్ ద్వారా తమ సిబ్బందికి తెలియేసింది. ప్రస్తుతం 400 విమానాలు నిలిచిపోయినట్లు సమాచారం. ఇవి తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నట్లు పేర్కొన్నారు. లోపాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే సమాచారం ఇస్తామని తెలియజేశారు.