NewsNews AlertTelangana

థీమ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అలీ

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్‌లో రెస్టారెంట్ చెయన్ జిస్మత్‌జైల్‌ను , మండీ థీమ్ రెస్టారెంట్ ఓపెన్ చేసింది. దీనిని ప్రారంభించేందుకు టాలీవుడ్ హాస్యనటుడు అలీని ఆహ్వానించగా , ఆయన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ అనేక ఆహార పదార్థాలకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుందన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అలీతో పాటుగా జిస్మత్ మండీ నిర్వహకులు , ప్రముఖ యుట్యూబర్ గౌతమిని కూడా ఆహ్వానించింది.

అయితే గౌతమి మాట్లాడుతూ , గుంటూరు , వైజాగ్ , విజయవాడతో సహా పలు నగరాల్లో బ్రాంచీలు ఉన్న జిస్మత్ మండీ త్వరలోనే మరికొన్ని బ్రాంచీలను చందానగర్ , సుచిత్రలో కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను జైల్ థీమ్ లో నిర్మించామని , సర్వర్స్ ఖైదీల వేషంలోనే సర్వ్ చేస్తారని ఆమె చెప్పారు.