HealthHome Page SliderNational

లిప్‌స్టిక్ వాడేవారికి అలర్ట్..

గులాబీలాంటి పెదవుల అందాన్ని పెంచుకోవడానికి కొందరు అమ్మాయిలు లిప్‌స్టిక్ వాడుతూ ఉంటారు. మామూలు మేకప్‌లో భాగంగా దీనిని వాడుతున్నప్పటికీ రెగ్యులర్‌గా వాడితే అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లిప్‌స్టిక్‌లో ఉండే లెడ్, క్రోమియం, మెగ్నీషియం, అల్యూమినియం వంటి పదార్థాలు శరీరంలో చేరితే ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. ఇది నాలుక ద్వారా కడుపులో చేరితే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. పెదవులపై ఉండే లేత చర్మంపై లిప్‌స్టిక్ వేయడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారుతాయి. ఈ ప్రమాదాలను తప్పించుకోవాలంటే తరచూ లిప్‌స్టిక్ వాడకుండా ఉంటే మంచిది. హెర్బల్ లిప్‌స్టిక్‌ను ఎంచుకోవచ్చు. మంచి బ్రాండ్ లిప్‌స్టిక్‌లనే వాడాలి. కెమికల్స్ లేని లిప్‌స్టిక్ ఉపయోగించాలి. ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు దీనిని వేసుకోవడం మానేస్తే మంచిది. లిప్‌స్టిక్‌ మాత్రమే కాదు, రసాయనాలు కలిసి ఉండే మేకప్ సామాగ్రి ఏదైనా కూడా సహజ సిద్దమైన చర్మ సౌందర్యాన్ని పాడు చేస్తుందని డెర్మటాలజిస్టుల సలహా.