డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు అలెర్ట్
తెలంగాణ విశ్వవిద్యాలయాల కులపతుల సమావేశంలో డిగ్రీ లేదా బీటెక్ చదువుతున్న విద్యార్థుల హాజరుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి అర్హత ఉండదని గురువారం జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారు. కనీసం 75 శాతం హాజరుపై గతంలోనే ప్రభుత్వం ఆదేశించిందని, కానీ అమలు కావడం లేదని వీసీలు పేర్కొన్నారు. అందుకే ఈ సారి హాజరును ఫీజు రీయింబర్స్‌మెంటుకు ముడిపెట్టి తప్పనిసరి చేస్తున్నామని పేర్కొన్నారు. దీనితో విద్యానాణ్యత కూడా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

