అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్..
నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి, ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఇప్పుడు నెటిజన్లకు హాట్ టాపిక్ గా మారారు. పచ్చళ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నందుకు కస్టమర్ ను రాయడానికి వీల్లేని భాషలో బండబూతులు తిట్టారు. ఆ కస్టమర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. పైగా.. నెట్టింట బాయ్ కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ నెటిజన్లు ఓ హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పచ్చళ్ళ లొల్లి ఆసుపత్రికి చేరింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేకే చిట్టి అనారోగ్యం పాలైనట్లు ఆమె సోదరి సుమి తెలిపింది. ప్రస్తుతం అలేఖ్య చిట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన నాన్న మూడు నెలల క్రితం చనిపోయారు. తన ఇంట్లో మరో చావు వద్దంటూ ఆమె ఏడ్చుకుంటూ వేడుకుంది. ఇకనైనా ట్రోలింగ్ ఆపండి.. మాకు ఏ పచ్చళ్ళ బిజినెస్ వద్దు.. మమ్మల్ని వదిలేయండి అంటూ సుమి నెటిజన్లను వేడుకుంది.


 
							 
							