Andhra PradeshHome Page Slider

బీఆర్ఎస్‌కు ఆకుల లలిత రాజీనామా

నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం కొనసాగుతున్న తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీడీసీ) ఛైర్‌పర్సన్‌ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోంది. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఈ అంశాలు నన్ను బాధించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌ను వీడుతున్నా. మీ నాయకత్వంలో ఆరేళ్లపాటు పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న లలిత, ఆమె భర్త రాఘవేందర్‌తో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఆమె గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.