దీపావళి పండుగతో ఢిల్లీలో మరింత పెరిగిన వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకు అక్కడ వాయు నాణ్యత మరింత క్షీణించింది. దీపావళి రోజున క్రాకర్స్ అంతగా పేల్చొద్దాన్నా ప్రజలు ఇష్టం వచ్చినట్లు కాల్చి, కాలుష్యాన్ని పెంచడం వల్ల ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ WHO సూచించిన పరిమితి కంటే 65 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఉ.5 గంటలకు AQI 507 పాయింట్లతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.