అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంలో అదానీకి ఊరట
అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంలో విచారణకమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ నివేదికలో అదానీ గ్రూప్‌కు ఊరట లభించింది. స్టాక్ ధరల నియంత్రణలో వైఫల్యం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఈ నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ విషయంలో లోతుగా విచారణ చేయాలంటే ఇంకా సమయం పడుతుందని తెలియజేశింది. ప్రాధమిక విచారణ కోసం కేంద్రం అదానీ గ్రూప్ వ్యవహారంపై కమిటీని వేసిన సంగతి తెలిసిందే. దీనిలో స్టాక్ ధరల తారుమారు వ్యవహారంలో, విదేశీ నిధులు సంపాదించడంలో అవకతవకలు జరిగాయని హిండెన్‌బర్గ్ ఆరోపించడంతో కేంద్రప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని వేశారు. ఇప్పుడు ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. గతంలో హిండెన్‌బర్గ్ పత్రిక ప్రకారం అదానీ గ్రూప్ విదేశీ పెట్టుబడులలో అవకతవకలు జరిగాయని తెలిసింది. దీనితో అదానీ షేర్స్ దారుణంగా పడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నివేదికతో అదానీ గ్రూప్ ఒడ్డున పడినట్లే కనిపిస్తోంది.

