Home Page SlidermoviesNationalNews

తమిళ-తెలుగు వివాదంలో నటి కస్తూరి

సీనియర్ నటి కస్తూరి తమిళ-తెలుగు వివాదంలో ఇరుక్కున్నారు. నోటి దురుసుతో లేనిపోని వివాదాలు తలకెత్తుకున్నారు. 90లలో తెలుగు, తమిళ చిత్రాలలో ఒక వెలుగు వెలిగి, మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు కస్తూరి. ఈ మధ్యనే రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు వారిపై చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తెలుగు వారు ఒకప్పుడు తమిళనాట అంతఃపురాలలో పనులు చేయడానికి వచ్చినవారని, కానీ తమిళనాడులో క్రమంగా ప్రాధాన్యత సంపాదించి,తమిళులను అణగదొక్కుతున్నారని వ్యాఖ్యానించింది. ఒక సభలో మాట్లాడుతూ, ద్రవిడులంటే తెలుగువారికి తెలియదన్నారు.  కానీ తమిళ రాజకీయాలలో, సినీ రంగంలో తెలుగు మాట్లాడేవారికే పదవులు వస్తున్నాయని విమర్శించారు. గతంలో కూడా రజనీకాంత్, నయనతార, అజిత్ వంటి సూపర్ స్టార్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశారు కస్తూరి.