Home Page SliderTelangana

బీజేపీలో చేరిన నటి జయసుధ

తెలుగు చిత్ర సహజనటి జయసుధ నేడు బీజేపీ పార్టీలో చేరారు. కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ సమక్షంలో ఆమె బీజేపీ పార్టీలో చేరారు. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. నటి జయసుధ మాట్లాడుతూ తాను ఒక సంవత్సర కాలంగా బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నానని, ఇప్పటికి కుదిరిందని ఆమె తెలిపారు. ఆమె ఇప్పటికే అమిత్‌షాను కలిసానని తెలియజేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే, ప్రధాని నరేంద్రమోదీ ప్రేరణతో ఆమె తిరిగి రాజకీయాలలోకి వచ్చానని తెలియజేశారు.  ఆమె సికింద్రాబాద్ నుండి ఎన్నికల బరిలో నిలబడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఎవరు చేరినా తమ పార్టీలో చేర్చుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. ఏ సంఘానికి, కులసంఘాలకు, సేవా కార్యక్రమాలకు చేరే వారినైనా తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు.