నటుడు ప్రశాంత్‌కి ఝలక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేసిన పలు సాలిడ్ మాస్ చిత్రాల్లో దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన రిపీట్ వాల్యూ ఉన్న చిత్రం “వినయ విధేయ రామ” ఒకటి. కమర్షియల్‌గా డిజాస్టర్ టాక్‌తో కూడా చాలామేర వసూళ్లు అందుకున్న ఈ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడికి ఇప్పుడు చెన్నై ట్రాఫిక్ పోలీస్ ఝలక్ ఇచ్చారు. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు ప్రశాంత్ వినయ విధేయ రామలో చరణ్‌కి అన్నయ్యగా కనిపించిన సంగతి తెలిసిందే. మరి ఈ నటుడు లేటెస్ట్‌గా ఒక ఆర్ ఎక్స్ 100 బైక్‌ని రైడ్ చేస్తూ చెన్నై రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. దీంతో ఈ ఫోటోలు వీడియోలు వైరల్‌గా మారాయి. కానీ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఎవరూ అతీతం కాదు అందుకు చెన్నై ట్రాఫిక్ పోలీస్ అతడికి రూ.2,000 లు ఫైన్ వేసింది.
డ్రైవింగ్ చేస్తున్న ప్రశాంత్ అలానే తాను వెనుక కూర్చోబెట్టుకున్న అమ్మాయి ఇద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ వేసినట్టుగా పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక లేటెస్ట్‌గా అయితే ప్రశాంత్ హీరోగా నటించిన “అందగాన్” అనే సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.

