Home Page SliderTelangana

మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Share with

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులపై పెద్దఎత్తున కనీస మద్దతు ధర పెంచేలా నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.కాగా సుమారు 13 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నారు. అయితే వరి, పత్తి లాంటి పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులకు లాభం చేకూరనుందని తెలిపారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని కిషన్ రెడ్డి కొనియాడారు.అయితే రాష్ట్రంలో 1966లో కనీస మద్దతు ధర విధానం రావడం జరిగిందన్నారు. కాగా 1966 నుంచి 2014 వరకు (48 ఏళ్లు) వరి క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ. 1300 ఉందని ఆయన పేర్కొన్నారు.గత పదేళ్లలో వరి క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ. 1300 ఉంటే.. నరేంద్ర మోదీ ప్రభుత్వం దానికి వెయ్యి రూపాయలు పెంచి రూ. 2300 చొప్పున అందిస్తోందని మంత్రి వెల్లడించారు. పత్తి క్వింటాలుకు రూ. 501 చొప్పున పెంచి రూ.7,121 మద్దతు ధరను అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.