Home Page SliderInternationalNews Alert

హాలీవుడ్‌ నటుడు కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, హ్యారీ పోటర్‌ ఫేమ్‌ పాల్‌ గ్రాంట్‌ (56) కన్నుమూశారు. లండన్‌లోని యాస్టర్‌ రోడ్‌ సెయింట్‌ పాంక్రస్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడ చూసిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. విల్లో, లబిరింత్‌, ది డెడ్‌, లెజెండ్‌ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హ్యారీ పోటర్‌, స్టార్‌ వార్స్‌ చిత్రాలతో పాపులర్‌ అయ్యారు. ఆయనకి భార్య మరియా డ్వేర్‌, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పాల్‌ గ్రాంట్‌ 4 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నారు. స్పాండిలోపిఫినల్‌ డైస్పాల్షియా కాంజెనిటల్‌ అనే జెనెటిక్‌ డిజార్డర్‌ కారణంతో మరుగుజ్జులా ఉండిపోయారు. ఈ కారణంగా ఆయనకు పలు అనారోగ్య సమస్యలు వచ్చేవి.