బెయిల్, కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై విచారణను ఏసీబీ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నట్లు సమాచారం అందడంతో ఇంచార్జి న్యాయమూర్తి పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసును రద్దు చేయాలని, రిమాండ్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై విచారణకు సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ని కూడా సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.

