‘అభయహస్తం’ స్కీములో ఎలాంటి పైరవీలు కుదరదు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరకాస్తుల స్వీకరణ నేటి నుండి మొదలుకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీములకు సంబంధించి ఎలాంటి పైరవీలు చేయడానికి అవకాశం లేదని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఏదైనా సందేహాలుంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్‌లో 600 కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని, అర్హతను బట్టి లబ్దిదారుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.

