ఖుషి నుండి ‘ఆరాధ్య’ సాంగ్ ప్రొమో విడుదల
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమంత చిత్రం ‘ఖుషి’ నుండి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ‘నా రోజా నువ్వే’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో క్యూట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ చిత్రంపై సమంతా, విజయ్‌ల అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యవచ్చిన వీరిద్దరి చిత్రాలు ‘లైగర్’, ‘శాకుంతలం’ చిత్రాలు పరాజయం కావడంతో ఈ చిత్రమైనా హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రం 5 భాషలలో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ పాటను చిన్మయి, సిద్ శ్రీరామ్ పాడారు. పూర్తి పాటను 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలియజేసారు. ఈ చిత్రం సెప్టెంబరు 1న రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

కాగా సమంత చేతిలో ప్రాజెక్టులు పూర్తయ్యాయంటూ కార్వాన్ నుండి విశ్రాంతి కావాలంటూ ఈ మధ్య పోస్టు పెట్టింది. తన మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ అతి కష్టం మీద ఈ చిత్రాన్ని పూర్తి చేసింది సమంత. ఇక పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది.

