మద్యం మత్తులో యువతి హల్‌చల్… బీర్‌బాటిల్‌తో ఏఎస్సైపై దాడి
మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువత్ హల్ చల్ చేసింది. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో బహిరంగంగా బండి మీద కూర్చొని బీరు తాగుతూ నానా హంగామా చేసింది. నైట్ రౌండ్స్‌లో ఉన్న ఏఎస్‌ఐ ఆమెను చూసి వెళ్లి ప్రశ్నించగా బీర్ బాటిల్‌తో పోలీస్‌పై దాడి చేసింది. త్రీ టౌన్ ఏఎస్‌ఐపై దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మధ్యలో అడ్డు రావడంతో అతని కన్నుపై బీరు బాటిల్ తగిలి గాయం అయింది. పైగా బ్రీతింగ్ అనలైజర్‌తో చెక్ చేస్తే యువతి తాగిన మత్తు వాల్యూ 149 వచ్చింది. పోలీసులు అయితే మీరే చేస్తారంటూ అసభ్యపదజాలంతో యువతి రెచ్చిపోయింది. నా బాయ్ ఫ్రెండ్‌కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంటూ బెదిరింపులకు దిగింది. రేపటి నుంచి పోలీసులెవరూ రోడ్డు మీద తిరగకుండా చేస్తానని మద్యం మత్తులో హెచ్చరించింది. దీంతో ఆ యువతిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన విశాఖలో సంచలనంగా మారింది.

