ఫ్రాంక్ వీడియో చేస్తున్న యువకుడికి దేహశుద్ధి
ఫ్రాంక్ వీడియో చేస్తున్న యువకుడికి వృద్ధుడు నడిరోడ్డుపై బుద్ధి చెప్పాడు. ఓ యువకుడు యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లి ప్రాంక్ వీడియో చేసేందుకు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. అటుగా కారులో వచ్చిన ఓ వృద్ధుడు యువతిని వేధిస్తున్నట్లు గమనించాడు. నిజమే అనుకొని కర్ర తీసుకుని యువకుడిని చితకబాదాడు. రోడ్డుపై ఉన్న జనాలు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


 
							 
							