అదృష్టం అంటే ఇదేనేమో..!
ఓ వైపు రైలు వస్తోంది.. మరోవైపు ఓ మహిళ పట్టాలు దాటుతోంది.. అంతలోనే రైలు రానే వచ్చింది.. రైలు వచ్చేస్తోందనే కంగారులో ఆమె పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో ఆమె భయపడకుండా అలాగే కదలకుండా పట్టాల మధ్యలో పడుకుంది. కొన్ని సెకండ్ల పాటు అలాగే రాళ్లపైన అతుక్కుపోయినట్లు కదలకుండా ఉండిపోయింది.దీంతో ట్రైన్ ఆమెపై నుంచి వెళ్లినా ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఇదంతా రైల్వేస్టేషన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

