గుజరాత్‌కు కన్నీటి వీడ్కోలు..
శుక్రవారం గుజరాత్ టైటాన్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన గుజరాత్ టీమ్ అభిమానులు ఉద్వేగానికి లోనయ్యారు. కీలకమైన పోరులో 20 పరుగుల తేడాతో ఓటమి పాలై, ఇంటిముఖం పట్టడంతో ఆటగాళ్లు, కుటుంబసభ్యులు, అభిమానులు దుఃఖం ఆపుకోలేకపోయారు. ఈ సీజన్ నుండి వారికి కన్నీటి వీడ్కోలు పలికారు. గుజరాత్ కోచ్ అశిష్ నెహ్రా కుమారుడు, శుభ్‌మన్ గిల్ సోదరి ఏడుస్తూ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా సాగిందని, తమ టీమ్ చక్కగానే ఆడినా, కీలకమైన తేలికైన మూడు క్యాచ్‌లను వదిలివేయడమే తప్పిదమని ముంబయి టీమ్‌ను 210 పరుగులకు కట్టడి చేయగలిగితే ఆట మరోలా ఉండేదని పేర్కొన్నారు. గుజరాత్ విషాదంపై ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో ‘మైటీ ఎఫర్ట్ ఆన్ మైటీ అకేషన్’ అంటూ వీడియోను షేర్ చేసింది.

