కాలి నడకన శబరిమలకు సూపర్ స్టార్..
కేరళలోని ప్రసిద్ధి చెందిన అయ్యప్పస్వామి దేవాలయం శబరిమలకు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాలినడకన ప్రయాణించి, తన భక్తిని చాటుకున్నారు. అనంతరం 18 పవిత్ర మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. భుజాన ఇరుముడితో ఆయన కాలినడకన వెళ్లారు. ఈ మార్గంలో పలువురు భక్తులు ఆయనతో ఫోటోల కోసం పోటీ పడ్డారు.


