నేడు భూమిని తాకనున్న సౌర తుఫాన్..
నేడు సౌర తుఫాను భూమిని తాకే అవకాశాలు ఉన్నాయని… దాని ప్రభావంతో మొబైల్స్ , జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు తాత్కలికంగా అంతరాయం కలగొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా సైతం ధృవీకరించింది. సహజంగా సూర్యుడి నుండి వెలువడే ఫొటాన్‌ల ద్వారా వచ్చే రేడియేషన్ కారణంగా ఈ సౌర తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావం భూకక్షలోని ఉపగ్రహాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి భూమిని తాకే అవకాశం ఉంది. అయితే జులై 15న సూర్యుడిపై శక్తి వంతమైన సౌర జ్వాల మెదలైంది. 20, 21 తేదీల్లో భూమధ్య అయస్కాంత క్షేత్రాన్ని సౌర తుఫాను తాకే అవకాశముందని పరిశోధకులు చెప్తున్నారు.
గతంలో కూడా సౌర తుఫాను ప్రభావం భూమిపై పడినప్పుడు ఉత్తర, దక్షిణ ధ్రువాలలో సూర్యకాంతి చాలా ప్రకాశవంతంగా ఉంటుందని పరిశోధకులు వివరించారు. అంతే కాకుండా సౌర తుఫాను ఎర్పడిన ప్రాంతలో భూ వాతవరణం వేడెక్కడం, జీపీఎస్ , మొబైల్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీలు , రెడియో సిగ్నల్ లకు అంతరాయం ఎర్పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం సంభవించే ఈ సౌర తుఫాను శక్తివంతమైనదా… ఎంత ఎఫెక్ట్‌తో భూమిని చేరుతుందీ… దీని కారణంగా ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, ఏ ఏ సేవలకు అంతరాయం కలుగుతుందో తెలియాల్సి ఉంది.