Home Page SliderTelangana

నాగార్జునకు షాక్… ఎన్ కన్వెషన్ కూల్చివేత

హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ను హైడ్రా టీం కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కన్వెషన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్ కన్వెషన్ సెంటర్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది. కన్వెషన్ ను నేల మట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తోంది. గతంలో సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెషన్ సెంటర్ ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అక్కడిదాకా వెళ్ళిన బుల్డొజర్లు దాన్ని టచ్ చేయలేకపోయాయి. అప్పటి నుంచి ఈ కన్వెషన్ జోలికి ఎవరూ వెళ్లలేదు. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట అధికారులు అక్రమ కట్టడాలను కూల్చేయడం జరుగుతోంది.