Andhra PradeshHome Page Slider

గడప గడపకు ఎమ్మెల్యే యాత్రలో వైసీపీ ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యే శిల్పారవికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చింతకుంట్ల గ్రామస్తులు చుక్కలు చూపించారు. గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా చింతకుంట్ల గ్రామస్తులను పలకరించిన ఎమ్మెల్యే శిల్పారవిని రోడ్లు వేయాలని నిలదీసారు గ్రామస్తులు. డబ్బిస్తే ఈసారి ఓట్లు వేయమని, రోడ్లు వేస్తేనే వచ్చే ఎన్నికలలో ఓట్లు వేస్తామని తేల్చి చెప్పారు.  ఎమ్మెల్యేగా ఊరికి ఏమీ చేయలేదని మండిపడ్డారు గ్రామస్తులు.  పథకాల గురించి అడుగుతున్న ఎమ్మెల్యేను మాట్లాడనీయకుండా ఒక మహిళతో సహా కొంతమంది గ్రామస్తులు వాగ్వాదం పెట్టుకున్నారు. చేసేదేమీ లేక నవ్వుతూ వెనుదిరిగారు శిల్పారవి.