మెగా ఫ్యామిలీ కోడలికి అరుదైన ఘనత..
అపోలో హాస్పిటల్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు, రాంచరణ్ సతీమణి ఉపాసన కోణిదెల అరుదైన ఘనత సాధించారు. ఇటీవల ఈమె మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో చోటు సంపాదించారు. దీంతో నెటిజన్లు, మెగా అభిమానులు, ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఉపాసన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు లభించినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి ఉపాసన కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈమె ప్రస్తుతం అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ.. బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. యు ఎక్స్చేంజ్ అనే సేవా సంస్థ నెలకొల్పిన ఉపాసన పాత స్కూల్ పుస్తకాలు సేకరించి పేద పిల్లలకు పంచిపెట్టారు. అంతే కాకుండా మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే పిల్లలకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించేవారు. తర్వాత రీజెంట్స్ యూనివర్సిటీ లండన్ నుంచి ఇంటర్నేషనల్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. 2012న మెగాస్టార్ ఫ్యామిలీకి కోడలయ్యారు.

