NationalNews

వన్ మ్యాన్ షో…

లైగర్‌… లైగర్‌… దేశమంతా ఈ మూవీదే చర్చ. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్‌.. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది. మరీ ఈ లైగర్‌ అంచనాలు అందుకున్నాడా..  లేదా.. ఈ రివ్యూలో చూద్దాం.

స్టోరీ:

లైగర్‌ (విజయ్‌ దేవర కొండ) వాళ్ల అమ్మ బాలమణి(రమ్యకృష్ణ) కరీంనగర్‌ నుంచి ముంబైకి వస్తారు. ఓ చాయ్‌ బండి నడుపుకుంటూ తన కొడుకుని నేషనల్‌ ఛాంపియన్‌ చేయాలని కలలు కంటుంది. దానికోసం ఒక కోచ్‌ను పట్టుకొని మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటాడు లైగర్‌.  ఈ క్రమంలోనే తాన్య (అనన్యపాండే) తో ప్రేమలో పడతాడు కానీ ఆమె అతన్ని మోసం చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైగర్‌ నేషనల్‌ ఛాంపియన్‌ ఎలా అయ్యాడు… అక్కడి నుంచి ఇంటరేనషనల్‌కి ఎలా వెళ్లాడు? తన గురువులా భావించే మైక్‌ టైసన్‌తో లైగర్‌ ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేది మిగిలిన స్టోరీ…

ఈ మూవీకి వచ్చినంత హైప్‌, మరే ఏ సినిమాకు రాలేదు. భారీ అంచనాల మధ్య పక్కా మాస్‌ మసాలా అంశాలతో ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా వచ్చిన ఈ చిత్రం మొత్తానికి మాస్‌ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటుంది. విజయ్‌ దేవరకొండ విషయానికొస్తే.. తన నటనతో అద్భుతంగా నటించాడు. విజయ్‌ యాక్టింగ్‌ ఫుల్‌ ఎనర్జీతో సాగుతుంది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ విజయ్‌ పాత్ర. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో విజయ్‌ నటన చాలా ఎనర్జిటిక్‌ ఫెర్మార్మెన్స్‌తో తన పాత్రకు న్యాయం చేశాడు. సాధారణ ప్రేక్షకులను కూడా థ్రిల్‌ చేశాడు.  హీరోయిన్‌గా నటించిన అనన్యపాండే కూడా తన గ్లామర్‌తో బాగా అలరించింది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో విజయ్‌ అనన్య కెమిస్ట్రీ బాగుంది. రమ్యకృష్ణ, అలీ, మైక్‌ టైసన్‌లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఆలీ, గెటప్‌ శ్రీను అక్కడక్కడ నవ్వులు పూయించారు.

ప్రతి సినిమాలో బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్‌ దట్టించే పూరీ… ఈ సినిమాలో అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించలేదు. రెగ్యులర్‌, రొటీన్‌ ఫార్మాట్‌తో స్టోరీ లేకుండానే కేవలం విజయ్‌ దేవరకొండ నటనతో మ్యాజిక్‌ చేయాలనే సాహసం చేశాడనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్రను ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. మిగితా పాత్రలు పేలవంగా కనిపిస్తాయి. నత్తి అనేది సినిమా ఫ్లోకు అడ్డుపడిందా అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికి… చాలా చోట్ల డైలాగ్స్‌తో పూరీ మెరుపులు మెరిపించాడు. స్టోరీపై మరింత ఫోకస్‌ చేస్తే ఫ్యాన్స్‌ ఇంకా ఎంజాయ్‌ చేసేవారేమో అనిపిస్తుంది.  విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్‌గా ఉంది. సునీల్‌ కశ్యప్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ చిత్రానికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. రెండు పాటలు మినహా మిగతా పాటలు అంతగా కనెక్ట్‌ కాలేకపోయాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

విజయ్‌ నటన, మాస్‌ డైలాగ్స్‌, పాటలు, బీజీఎం, రమ్యకృష్ణ ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

కథ, కథనాలు, కొత్తదనం లేకపోవడం

మొత్తంగా లైగర్‌ సినిమా మాత్రం పూర్థి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. కథనం రొటీన్‌గా సింపుల్‌గా ఉండటం, కొన్ని చోట్ల సీన్స్‌ పేలవంగా ఉండడం. అయితే.. విజయ్‌ దేవరకొండ హై ఎనర్జిటిక్‌ ఫెర్మార్మెన్స్‌ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఓవరాల్‌గా లైగర్‌ మాస్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది.