Home Page SliderTelangana

విడాకులపై నిహారిక స్పందన

తన భర్త జొన్నలగడ్డ చైతన్య, తను పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, ఈవిషయంలో తమ వ్యక్తిగత జీవితంలో ఎవరూ తొంగిచూడొద్దని నిహారిక స్పందించింది. ఇలాంటి సున్నిత విషయాలలో ప్రశ్నలడిగి తమను బాధపెట్టొదని ఇన్ స్టాగ్రామ్ పోస్టులో ప్రకటించారు. తాము కొత్తగా ప్రారంభించబోయే జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నామని,తమ అభిప్రాయాలను గౌరవించాలని కోరుతున్నారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులకు, మిత్రులకు, సన్నిహితులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.