Breaking NewscrimeHome Page SliderInternationalNational

మూగ‌బోయిన విశ్వవాయిద్య త‌బ‌ల‌

ప్ర‌పంచ ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్ (73) సోమ‌వారం క‌న్నుమూశారు.ఆయ‌న గ‌త కొంత కాలంగా హృద్రోగంతో బాధ‌ప‌డుతున్నారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు దృవీకరించిన కుటుంబసభ్యులు తెలిపారు. సంగీత దర్శకుడు, నటుడు కూడా అయిన‌టువంతి జాకీర్ హుస్సేన్ కు భారత ప్రభుత్వాలు 1988లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అంజేశాయి. 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడెమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1999 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది. 2009లో గ్రామీ పురసస్కారం కూడా అందుకున్నారు.