విజయనగరం కలెక్టరేట్ వద్ద గొంతు తెగి పడిన వ్యక్తి
విజయనగరంలో దారుణం జరిగింది. కలెక్టరేట్ ఆఫీస్ భవనం ప్రాంగణంలో గొంతు తెగి బోర్లా పడిన వ్యక్తి కనిపించాడు. అతని గొంతు తెగినట్లు కనిపిస్తోంది. దగ్గరలో వరదలా నెత్తురు పారుతోంది. పగలిన గాజు సీసా దగ్గరలో కనిపిస్తోంది. అతనే గొంతు కోసుకున్నాడా వేరెవరైనా అతనిపై దాడి చేశారా అనే విషయాలు సస్పెన్స్‌గా మారాయి. తీవ్ర గాయం, నొప్పితో బాధపడుతున్న ఆవ్యక్తి ఏమీ మాట్లాడలేక పోతున్నాడు. అతనిని గమనించిన స్థానికులు, పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా హుటాహుటిన అతనిని హాస్పటల్‌కు తరలించారు. అతని వివరాలు తెలియరాలేదు. . దీనికి గల కారణాలు కూడా తెలిసిరాలేదు.

