home page sliderHome Page SliderNational

డీఎంకే ఎంపీకి తప్పిన పెను ప్రమాదం

డీఎంకే ఎంపీ ఏ. రాజాకు పెను ప్రమాదం తప్పింది. నిన్న సాయంత్రం తమిళనాడులోని మయిలాడుతురైలో ప్రజా సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో గాలివానతో ఒక లైట్‌స్టాండ్ కూలిపోయింది.ఆయన దానిని గమనించి పక్కకు జరగడంతో ఘోర ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.