మెటాలో భారీ లేఆఫ్
భారీ లేఆఫ్‌ల భయంతో మెటా ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా మరోమారు ఉద్యోగాలలో కోత పెట్టనుంది. మెటా పరిధిలోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి రంగాలలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాలలో భాగంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. టెక్ కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఏఐ సాంకేతికత కోసం కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీనితో ఇంటెల్, సిస్కో, ఐబీఐ వంటి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

